కాజీపేట రైల్వే జంక్షన్ ఎదుట సీఐటీయూ కార్యకర్తల ఆందోళన

కాజీపేట రైల్వే జంక్షన్ ఎదుట సీఐటీయూ కార్యకర్తల ఆందోళన

HNK: కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే జంక్షన్ ఎదుట రైల్వే వ్యవస్థను కాపాడాలని సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు నేడు ఆందోళన నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆధ్వర్యంలో రైల్వేను కాపాడాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.