యూరియా తిని 12 మేకలు మృతి
MBNR: యూరియా తిని 12 మేకలు మృతి చెందిన సంఘటన నవాబుపేట మండలం అమ్మపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రభాకర్ 25 మేకలతో జీవనాధారం పొందుతున్నాడు. అదే గ్రామంలోని ఓ రైతు పొలంలో ఉన్న యూరియాను తిని 12 మేకలు ప్రమాదవశాత్తు మరణించాయి. ప్రభాకర్ నిరుపేద అని.. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు.