గోపి మర్డర్ కేసులో 8 మంది అరెస్ట్

SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన సత్తారు గోపి 11న హత్యకు గురయ్యాడు. ఈ మర్డర్ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం వెల్లడించారు. నిందితులను ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎచ్చర్ల యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.