పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లు  పంపిణీ

SRCL: కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పం గొప్పదని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం బండపల్లి, జోగాపూర్‌లో పదో తరగతికి చదువుతున్న విద్యార్థులకు ఇవాళ సైకిళ్ల పంపిణీ చేశారు.