రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు
MBNR: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్ నగర్ బాలికల జట్టు రన్నర్స్(2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ గురువారం తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.