మట్టి వినాయక విగ్రహాల తయారీ

NRML: ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసి శభాష్ అనిపించుకున్నారు. వినాయక చవితి నేపథ్యంలో పర్యావరణానికి నష్టం కలగకుండా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో శనివారం పాఠశాలలో వారు అందమైన మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. పాఠశాల హెచ్ఎం బి.నరేందర్ మాట్లాడుతూ.. మట్టి గణపతి విగ్రహాలను వాడాలని కోరారు.