VIDEO: కూల్‌డ్రింక్ షాప్‌లో మద్యం అమ్ముతున్న మహిళపై కేసు

ప్రకాశం: కొనకలమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ వద్ద శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు మద్యం అమ్ముతున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహిళ కూల్‌డ్రింక్ షాప్‌లో మద్యం అక్రమంగా విక్రయిస్తుందన్న సమాచారంతో తనిఖీ చేయగా 35 మద్యం బాటిళ్లు చిక్కాయని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ అరుణ కుమారి తెలిపారు. ఈ మేరకు బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.