'ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

VKB: ఖరీఫ్ వరి ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం ధాన్యం సేకరణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.