బీమా డబ్బు కోసం మామను చంపిన అల్లుడు

బీమా డబ్బు కోసం మామను చంపిన అల్లుడు

AP: అనకాపల్లి కశింకోట మండలంలో దారుణం జరిగింది. రూ.1.08 కోట్ల బీమా నగదు కోసం కొత్తపల్లికి చెందిన సుంకర అన్నవరం.. తన కొడుకు జ్యోతిప్రసాద్‌తో కలిసి మామ నారాయణరావు(54)ను హత్య చేశాడు. ఈ మేరకు ఈ నెల 9న చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసు విచారణలో నిజం బయటపడగా.. నిందితులతో పాటు హత్యకు సహకరించిన LIC ఏజెంట్ నానాజీ అరెస్ట్ అయ్యారు.