'కగార్ ఆపరేషన్ ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి'

'కగార్ ఆపరేషన్ ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి'

KMM: కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ వి.బాబు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో జన సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో జన సమితి పార్టీ బలోపేతానికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.