MRO కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
KDP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం సిద్దవటం MRO కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు MRO ఆకుల తిరుమల బాబు బుధవారం తెలిపారు. తుఫాన్ ప్రభావంతో మండలంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలుగకుండా ముందస్తు చర్యగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇద్దరు సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు.