VIDEO: స్టేడియం వద్ద ఫ్యాన్స్ హంగామా..!
VSP: పీఎంపాలెంలోని క్రికెట్ స్టేడియం పరిసరాల్లో భారత్–న్యూజిలాండ్ మ్యాచ్ సందడి నెలకొంది. బుధవారం స్టేడియం వెలుపల టీమ్ ఇండియా జెర్సీలు, జెండాలు కొనుగోలు చేసేందుకు అభిమానులు గుమిగూడారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నీలం రంగు దుస్తులు ధరించి ఫ్యాన్స్ ఉత్సాహంగా కనిపించారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేయాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.