పాలకుల నిర్లక్ష్యంతోనే రాయలసీమ వెనకబడింది: ఓబులేశ్
KDP: పాలకుల నిర్లక్ష్యంతోనే రాయలసీమ అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేశ్ యాదవ్ మండిపడ్డారు. కడప ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మధ్యలోనే కడప, బెంగళూరు రైల్వే లైను ఆగిపోవడం, శిలాఫలకాలకే పరిమితమైన ఉక్కు ఫ్యాక్టరీ, పులివెందుల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ లాంటివి ప్రభుత్వ వైఫల్యాలేనని ఆయన విమర్శించారు.