ఈదురుగాలుల వర్షం.. రైతన్న ఆగమాగం

సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మోత్కూరు అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొన్నిచోట్ల వర్షపు నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి.