'బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు'
ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామని పెద్దచేర్లోపల్లి ఎస్సై కోటయ్య అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న పలువురికి ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సంహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.