ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్‌లకు స్థలం కేటాయింపు

ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్‌లకు స్థలం కేటాయింపు

కృష్ణా: మచిలీపట్నంలో మరో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గన్నవరంలో క్రీడల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియాలో భాగంగా నగరంలోని గోసంఘం టిడ్‌కో గృహాల సమీపంలో రూ.17 కోట్లతో బహుళ ప్రయోజనాల ఇండోర్ స్టేడియం, రూ. 9.30 కోట్లతో స్విమ్మింగ్ పూల్‌కి స్థలం కేటాయించామన్నారు.