శ్రీవారి సేవకుల సేవలు అమోఘం: నిర్మలా సీతారామన్

శ్రీవారి సేవకుల సేవలు అమోఘం: నిర్మలా సీతారామన్

తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఆమె శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే, భోజనశాల వద్దకు చేరుకుని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.