VIDEO: నాగలాపురంలో అట్టహాసంగా కల్యాణోత్సవం
TPT: నాగలాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.