ప్రమాదం.. తల్లీ, కొడుకు మృతి

ప్రమాదం.. తల్లీ, కొడుకు మృతి

కృష్ణా: తిరువూరుకు చెందిన తల్లీ, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు భద్రాద్రి జిల్లాలో దమ్మపేట (M) గాంధీనగర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై  వస్తున్న తల్లీ, కుమారుడు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు తిరువూరు (M) ముష్టికుంట్లకు చెందిన సరస్వతి (70), కృష్ణ (54)గా గుర్తించారు.