'ఇంటింటి చెత్త సేకరణ పక్కగా జరగాలి'

CTR: నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీలో బుధవారం తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి డి.సుశీలా దేవి పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ పక్కగా జరగాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలలోపే చెత్త సేకరణ చేపట్టి, ఫోటోలను ఎప్పటికప్పుడు పీఆర్ వన్ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం ఐవీఆర్ఎస్ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.