VIDEO: వెల్దుర్తిలో వీధి కుక్కల బెడద.!
MDK: వెల్దుర్తిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఒంటరిగా రోడ్డుపై వెళ్లే పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో కుక్కల దాడిలో చాలామంది గాయాల పాలయ్యారు. పంచాయతీ అధికారులు గతంలో కుక్కలను పట్టించి దూర ప్రాంతంలో వదిలినా గ్రామానికి చేరుతున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించి ప్రమాదాలకు గురిచేస్తుండడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.