దీదీపై ప్రధాని మోదీ విమర్శలు
బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మమతాపై మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆరోపించారు. న్యాయవాదులకే రక్షణలేనప్పుడు, సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి అక్రమ వలసదారుడిని వెనక్కి పంపుతామన్నారు.