ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: సీతయ్య

SRPT: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య కోరారు. మంగళవారం తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి నెల రోజులు కావొస్తున్నా కాంటాలు కాకపోవడం, లారీల కొరతతో కాంటాలు పెట్టిన ధాన్యం ఎగుమతులు కాకపోవటంతో అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.