ముగ్గురు కోడిపందెం రాయుళ్ల అరెస్టు
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సీతారాంపురం గ్రామ శివారున రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావుకు వచ్చిన సమాచారం మేరకు శనివారం సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు కోడిపందెం రాయుళ్లను అదుపులోకి, తీసుకుని వారి వద్ద నుంచి 5200 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే, వారిపై కేసు నమోదు చేశామన్నారు.