రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి

HNK: జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు జిల్లా అధికారులతో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ మహేందర్ పాల్గొన్నారు