నియోజకవర్గ అభివృద్దే నా ధ్యేయం: ఎమ్మెల్యే

JN: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన లక్ష్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్యతో కలిసి పరిశీలించారు. సభకు వేల సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.