తాగునీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్

తాగునీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్

KKD: జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఎస్ఈ అబ్దుల్ మతీన్ తెలిపారు. ఏవైనా ఇబ్బందులుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 0884 2351810 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.