రైలులో నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
JN: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఇవాళ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని కుడికాలు మోకాలు వరకు తెగిపోయినట్లు సమాచారం. వెంటనే 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పెగడపల్లికి చెందిన బొంత దేవరాజుగా గుర్తించారు.