వంద పడకల ఆసుపత్రి పనుల పరిశీలన
GNTR: మంగళగిరి మండలంలోని చినకాకాని గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులను ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.