VIDEO: ఆటపాటలతో ముగిసిన ఉత్సవాలు
SRD: నాగలిగిద్ద మండలం కరస్ గుత్తి గ్రామంలో నిర్వహించిన అఖండ హరినామ సప్తాహం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో వార్కారి సాంప్రదాయ భజనలు తోపాటు, వినూత్నంగా కోకో, కబడ్డీ, పూగిడి తదితర ఆటలు, భక్తి పాటలు పాడుతూ కార్యక్రమాలను ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించారు. గత వారం రోజుల నుంచి హరినామ స్మరణతో మార్మోగిన ఆలయం, చివరి రోజైన ఇవాళ ఆటపాటలతో ముగిసింది.