ఈనెల 28న మెగా లోక్ అదాలత్: ఎస్పీ
MDK: ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న వివాదాలను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన వివాదాలు తదితర కేసుల రాజీ ఉంటుందన్నారు