పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం
HYD: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2025 జనవరి నుంచి పలుసార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. నిందితుడు కేరళకు చెందిన నసీముద్దీన్‌గా గుర్తించారు.