ఉపాధి హామీ పనులు అమలు చేయండి: కూలీల ఆవేదన

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఈ సంవత్సరం 250 రోజుల పని దినాలు కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పనులు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమ పిల్లల చదువులను నాశనం చేసుకుంటున్నామని ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.