వారానికి 3 రోజులు తనిఖీ చేపట్టాలి: కలెక్టర్
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఆహార నాణ్యతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించి, వారానికి కనీసం 3 రోజులు మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలని, తాగునీటి శుద్ధి, వంటగదుల పరిశుభ్రతను కచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు.