రాహుల్.. ఈసీని ఆశ్రయించండి: కేంద్రమంత్రి
బీహార్‌లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమైనవని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలుంటే ECని ఆశ్రయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అందుకే ఆ పార్టీ నేత అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం పేరుతో కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.