‘బకాయిలు చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ’

‘బకాయిలు చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ’

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు ఈనెల 31వ తారీకు లోపు చెల్లించిన పక్షంలో 50% వడ్డీ రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర పేర్కొన్నారు. వివిధ ఖాళీ స్థలాలు, ఇంటి పనులు బకాయిలు ఉండి పూర్తిగా చెల్లించిన పురజనులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. సమీప సచివాలయం గాని, మున్సిపల్ కార్యాలయం వద్ద గాని చెల్లించవచ్చన్నారు.