ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి

మన్యం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీఓపెన్ కారాదని అధికారులను కోరారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది.