నేడు సర్వసభ్య సమావేశం

ASR: ముంచంగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సూర్యనారాయణ మూర్తి తెలిపారు. ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన ఉదయం 10గంటలకు సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు నెలల పాటు జరిగిన అభివృద్ధి, నెలకొన్న సమస్యలపై శాఖల వారీగా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.