ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడ సగటున AQI 358 పాయింట్లుగా నమోదైంది. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరగడంతో ఢిల్లీ వాసులు దగ్గు, కళ్ల మంటలు, శ్వాస సంబంధిత సమస్యలతో అవస్థలు పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం GRAP 3 నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పారిశ్రామిక కార్యకలాపాలపై, అత్యవసరం కాని డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు.