రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
KRNL: సి. బెళగల్ మండలం ఇనగండ్ల రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండ్రేవుల గ్రామానికి చెందిన సోమిరెడ్డి (29) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. మరో యువకుడు గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సోమిరెడ్డి మృతి చెందాడు.