VIDEO: పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం చేయాలి: కలెక్టర్
E.G: గోదావరి పుష్కరాలు-2027ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల విధులు, బాధ్యతలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై కార్యాచరణను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. CM సమక్షంలో గోదావరి పుష్కరాలకు ప్రణాళిక అందచేసే క్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమన్నారు.