తేలికపాటి వర్షంతో ఊరటనిచ్చిన వాతావరణం

విశాఖ: పాయకరావుపేట లో వేసవి ఎండతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు తేలికపాటి వర్షంతో ఊరటనిచ్చింది. మంగళవారం ఉదయం నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల గ్రామాలలో తేలికపాటి వర్షంతో కొంత ఉపశమనం కలిగింది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మార్పుతో ఊరట నిచ్చింది.