రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం కె. నాగలాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని నెరవాడ గ్రామం సమీపంలో మంగళవారం జరిగిన బైక్ ప్రమాదంలో గిడ్డయ్య (56) అనే వ్యక్తి మృతి చెందగా, అడివన్న అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.