పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

BPT: పిట్టలవానిపాలెం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. కళాశాలలో మౌలిక వసతులు, హాజరు శాతం, ఇన్విజిలేటర్లు, సిబ్బంది వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.