రైలు కింద పడి యువకుడి మృతి
జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీ వద్ద రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం లభ్యమయింది. శుక్రవారం ఉదయం గుర్తుతెలియని రైలు కింద పడి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. మృతుడు రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండాకు చెందిన సంతోష్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.