ఏర్పేడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

TPT: ఏర్పేడు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సుబ్బారాయుడు తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. సైబర్ నేరాలపై ప్రజలకు గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని SP హెచ్చరించారు.