అభివృద్ధి పనులను పరిశీలించిన ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్
KMR: బాన్సువాడ పరిధిలోని చింతల్ నాగారం నుంచి ఫిల్టర్ బెడ్ వరకు రూ. 30 లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం పరిశీలించారు. అలాగే, అమృత్ 2.0 పథకంలో భాగంగా వేస్తున్న మంచినీటి పైప్‌లైన్ పనుల పురోగతిని సమీక్షించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, మధు సుధన్ పాల్గొన్నారు.