తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణస్వామి రథోత్సవం

సత్యసాయి: ధర్మవరం మండలం తుంపర్తి గ్రామంలో శ్రీకృష్ణస్వామి రథోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గ్రామస్థులు శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకిలో ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారికి పూలు, పసుప, కుంకుమ సమర్పించి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.