'సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలి'

'సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలి'

WGL: సీఎం రేవంత్ రెడ్డి హిందూ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ డిమాండ్ చేశారు. హిందూ దేవతలపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఈ నెల 5న సీఎం నర్సంపేట పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.