పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్: ఆమంచి

బాపట్ల: వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, బీసీ నేత పేరుల జనార్దన్ ఆయన అనుచురవర్గంతో కలిసి శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పందిళ్ళపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.